అబిడ్స్‌లోని జగదీశ్ మార్కెట్లో చరవాణి మరమ్మతులు చేసే అశోక్ పాటిల్ అనే యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది మార్చిలో ఓ యువతి తన ఫోన్ రిపేర్ కోసం అశోక్ దుకాణానికి వెళ్లింది. రిపేర్ చేయడానికి రెండు రోజుల సమయం పడుతుందని చెప్పి చరవాణిని తన వద్దే ఉంచుకున్నాడు.
మరమ్మతు చేశాక యువతి ఫేస్‌బుక్‌లోని ఫోటోలన్నింటిని తన లాప్‌టాప్‌లోకి కాపీ చేసుకున్నాడు. అనంతరం సదరు యువతి పేరు మీద నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న యువతి.. రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చూడండి: పీఆర్‌సీ నివేదికపై ఆందోళన వద్దు: మంత్రి శ్రీనివాసగౌడ్