నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్, పెంట్లపల్లి మండలాల్లోని పలు తండాలలో ఎన్పోర్స్మెంట్, ఎక్సైజ్ అధికారులు... 50 లీటర్ల సారా, 1500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. కొల్లాపూర్ మండలంలో బోరాబండ తండా, ఏన్మాన్ బెట్లతండా, సున్నపుతండా, పెంట్లపల్లి మండలంలో యాగంపల్లి తండాలో దాడులు నిర్వహించారు. నలుగురిపై కేసు నమోదు చేసి, రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
తండాల్లో సారాయి తయారు చేసినా, అమ్మినా... కఠిన చర్యలు తీసుకుంటామని ఆబ్కారీ సీఐ ఏడుకొండలు హెచ్చరించారు. అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్నట్టు వచ్చిన సమాచారంతో పెంట్లపల్లి ఎస్సై శ్రీనివాసులు, జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టీంతో కలిసి దాడులు నిర్వహించినట్టు తెలిపారు. దాడులు నిరంతరం కొనసాగుతాయన్నారు.
ఇదీ చూడండి: విషాదం: ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు రైతుల మృతి