ETV Bharat / jagte-raho

చైనా బెట్టింగ్​ కుంభకోణంలో దర్యాప్తు వేగవంతం - చైనా బెట్టింగ్​ కేసు తాజా వివరాలు

చైనా బెట్టింగ్ యాప్​ల కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. ముగ్గురు కీలక నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఈడీ ప్రత్యేక న్యాయస్థానం ముగ్గురు నిందితులను ఎనిమిది రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. చైనా, భారత్​కు చెందిన మరికొందరికి ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు ఈడీ భావిస్తోంది.

చైనా బెట్టింగ్​ కుంభకోణంలో దర్యాప్తు వేగవంతం

author img

By

Published : Sep 22, 2020, 8:15 PM IST

చైనా బెట్టింగ్ యాప్​ల కేసులో లోతుగా విచారణ చేపట్టేందుకు ఈడీ కసరత్తు చేస్తోంది. సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా కుంభకోణం జరిగినట్లు ఈడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ముగ్గురు కీలక నిందితులు యాన్ హో, ధీరజ్ సర్కార్‌, అంకిత్ కపూర్‌ని.... కోర్టు అనుమతితో 8 రోజులపాటు... కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తోంది. సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా కుంభకోణం జరిగినట్లు అంచనా వేస్తోంది.

డమ్మీ డైరెక్టర్లతో దోచేశారు..

యాన్ హో, ధీరజ్ సర్కారు, అంకిత్ కపూర్​లను ఈడీ అధికారులు చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. హైదరాబాద్ సీసీఎస్​లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కామర్స్ పేరుతో చైనీయులు వందలాది బెట్టింగ్ యాప్​లు నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. సీఏల సహకారంతో.. డమ్మీ డైరెక్టర్లతో భారత్​లో వందల కంపెనీలు సృష్టించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ వెబ్​సైట్లన్నీ అమెరికా నుంచి కొనసాగుతున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. పేటీఎం తదితర మొబైల్ వాలెట్​ల ద్వారా ఎక్కువగా లావాదేవీలు జరిపినట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.

బ్యాంకు ఖాతాలు సీజ్​

గత నెలలో దిల్లీ, గురుగ్రాం, ముంబయి, పుణేలోని 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. కీలక ఆధారాలు సేకరించింది. నాలుగు హెచ్ఎస్​బీసీ బ్యాంకు ఖాతాల్లో 47 కోట్ల రూపాయలు స్తంభింప చేసింది. సోదాల్లో 17 హార్డ్ డిస్క్​లు, 5 ల్యాప్​టాప్​లు, ఫోన్​లను స్వాధీనం చేసుకున్నారు. ఆన్​లైన్ వాలెట్ సంస్థలు, హెచ్​ఎస్​బీసీ, ఆర్వోసీల నుంచి ఈడీ సమాచారం సేకరిస్తోంది. ఆన్​లైన్ వాలెట్ సంస్థల ప్రమేయంపై కూడా ఆరా తీస్తోంది. మరోవైపు ఈ మోసంలో ఇంకా ఎవరెవరికి సంబంధం ఉందో తెలుసుకునేందుకు కీలక నిందితులను ప్రశ్నిస్తోంది.

ఇదీ చూడండి: చోరీ కేసును ఛేదించిన పోలీసులు... 62 తులాల బంగారం స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.