తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా హెడ్రీ పీఎస్ పరిధిలోని ఎలదుడమి అటవీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ప్రాజెక్టునగర్కు చెందిన కొట్టె అభిలాష్ అలియాస్ చందు అలియాస్ సోమ అనే పెరమిళి దళ కమాండర్ మృతి చెందినట్లు గడ్చిరోలి ఎస్పీ శైలేష్ బాల్కావుడే శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
మావోయిస్టులు, పోలీసు బలగాల నడుమ జరిగిన ఎదురుకాల్పుల్లో ఇతను మృతి చెందాడని ఎస్పీ పేర్కొన్నారు. ఎన్కౌంటర్ స్థలంలో ఓ తుపాకీ, వాకీటాకీలు, ప్రెషర్కుక్కర్లు, 20 కిట్ బ్యాగులు, సామగ్రి, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇతనిపై రూ.8 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.
ఇదీచూడండి: డేంజరస్: కాలకుండానే వదిలేస్తున్నారు... ప్రజలు వణికిపోతున్నారు!