ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మణుగూరు ఏరియా కమిటీ కమాండర్ రవ్వ రాము అలియాస్ సుధీర్, లాక్మాల్ మృతి చెందారు. నర్సింహసాగర్కు సుమారు నాలుగున్నర కిలో మీటర్ల దూరంలోని కోప్పుగుట్ట దగ్గరలో ఎన్‌కౌంటర్ జరిగింది.
మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ములుగు ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రవ్వ రాము అలియాస్ సుధీర్ స్వస్థలం వెంకటాపురమని తెలుస్తోంది.
ఇదీ చదవండి: వరుణుడు పగబట్టాడా.. మరో భారీ వర్షసూచన