యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ మారుస్తుండగా విద్యుదాఘాతానికి గురై చంద్రమౌళి అనే వ్యక్తి మృతి చెందాడు.
స్థానికంగా పిండి గిర్ని నడుపుతూ జీవనం సాగిస్తున్న చంద్రమౌళి.. గిర్నిలో విద్యుత్ సరఫరా నిలిచి పోవడం వల్ల ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ మార్చడానికి వెళ్లాడు. ఫ్యూజ్ మారుస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు. గమనించిన స్థానికులు చంద్రమౌళిని చికిత్స నిమిత్తం రామన్నపేట ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. చంద్రమౌళి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి.. గేదెను ఢీకొన్న స్కార్పియో... ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు