కామేపల్లి మండలం గోవింద్రాలలో నిన్న రాత్రి బలంగా వీచిన ఈదురుగాలులతో విద్యుత్ తీగలు తెగి కిందపడ్డాయి. ఇవాళ తెల్లవారుజామున నీళ్ల కోసం బయటకు వెళ్లిన 8 పాడి ఆవులు విద్యుత్ తీగలు తగలి అక్కడికక్కడే మృత్యువాతపడ్డాయి. విషయం తెలుసున్న రైతులు బోరున విలపించారు.
మృతిచెందిన పశువుల్ని చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. దాదాపు రూ.5 లక్షల మేర రైతులకు నష్టం వాటిల్లిందని.. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి: నిజామాబాద్‌లో జంట హత్యల కలకలం