ETV Bharat / jagte-raho

ఆరేళ్ల పగ: బావమరిదిని చంపిన బావ - ఖాజీపేటలో క్రైం వార్తలు

ఆరేళ్లుగా బావ బావమరుదుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మరోసారి ఓ విషయంపై ఘర్షణ పడ్డారు. బావ చేతిలో బావమరిది బలయ్యాడు. అసలేం జరిగింది!

murder
ఆరేళ్ల పగ: బావమరిదిని చంపిన బావ
author img

By

Published : May 10, 2020, 3:26 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా ఖాజీపేట మండలం మునిపాకలో భూ తగాదా ఒకరిని బలితీసుకుంది. బావ బావమరదుల మధ్య జరిగిన సంఘటనతో బావమరది షేక్‌ గౌస్‌పీర్‌ (55) మృతి చెందారు. గత ఆరేళ్లుగా గౌస్‌పీర్‌కు.. బావ నాయబ్‌ రసూల్‌కు మధ్య వివాదం నెలకొంది. ఆదివారం పొలం వద్ద గౌస్‌పీర్‌ కంపచెట్లు తొలగించే పనులు చేసుకుంటూ ఉండగా నాయబ్‌ రసూల్‌తోపాటు అతని అనుచరులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కత్తిపోటుకు గురైన గౌస్‌పీర్‌ను చికిత్స కోసం కడపకు ఆటోలో తరలిస్తూ ఉండగా మృతి చెందారు. ఖాజీపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: విషాదం : గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.