ETV Bharat / jagte-raho

ఆ కామెంట్లతో మానసిక క్షోభ అనుభవిస్తున్నాం: దిశ తల్లిదండ్రులు - సీసీఎస్ సీపీకి దిశ తల్లదండ్రుల వినతిపత్రం

దిశ ఎన్​కౌంటర్​ ట్రైలర్​ను యూట్యూబ్​లో నుంచి తీసేయాలని, సినిమా చిత్రీకరణను ఆపేయాలని... దిశ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీసీఎస్​ సంయుక్త సీపీ అవినాశ్ మెహంతికి వినతిపత్రం అందించారు.

disha parents complaint to ccs cp avinash mahanthi for stop movie
ఆ కామెంట్లతో మానసిక క్షోభ అనుభవిస్తున్నాం: దిశ తల్లిదండ్రులు
author img

By

Published : Nov 3, 2020, 3:19 PM IST

దిశ ఘటన నేపథ్యంలో రామ్​ గోపాల్ వర్మ చిత్రీకరిస్తున్న సినిమాను వెంటనే నిలిపేయాలని దిశ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఇప్పటికే యూట్యూబ్​లో ఉంచిన చిత్రం ట్రైలర్​ను కూడా తొలగించాలని కోరారు. ఈ మేరకు సీసీఎస్ సంయుక్త సీపీ అవినాశ్ మెహంతికి వినతిపత్రం అందించారు.

దిశ ఎన్​కౌంటర్ ట్రైలర్​ను యూట్యూబ్​లో చూసిన వాళ్లు పెడ్తున్న కామెంట్లు... తమను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయని దిశ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దిశ హత్యాచారానికి గురైన రోజే సినిమా విడుదల చేసే ఉద్దేశంలో రాంగోపాల్ వర్మ ఉన్నారని... ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దిశ కుటుంబ సభ్యులు కోరారు. ఈ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ... దిశ నిందితుల తల్లిదండ్రులు కూడా న్యాయ కమిషన్​ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఆ కామెంట్లతో మానసిక క్షోభ అనుభవిస్తున్నాం: దిశ తల్లిదండ్రులు

ఇదీ చూడండి: 'దిశ' చిత్రాన్ని ఆపాలంటూ న్యాయ కమిషన్​కు వినతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.