కర్నూలు జిల్లా నంద్యాలలో ఆగస్టు 16న దంత వైద్యురాలు మాధవీలత అనుమానాస్పదంగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడు లక్ష్మణ్ కిషోర్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరి ఇంట్లో మాధవీలత ఆత్మహత్య వల్ల విషాదంతో నిండింది. అనుమానాస్పద మృతి భావిస్తున్న ఈ కేసులో ఆమె రాసిన ఆత్మహత్య లేఖ మిస్టరీని ఛేదించింది.
అందులో... నన్ను క్షమించండి. నేను ఒక పొరపాటు చేశాను. నీతో బాధ్యతగా ఉండలేకపోయాను. మీ మీద ప్రేమతోనే ఆత్మహత్య చేసుకుంటున్నాను. బాబును బాగా చూసుకో.. నువ్వు మరో పెళ్లి చేసుకో. నేను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నానో అందరూ అడిగితే.. ఓ వ్యాధితో బాధపడుతున్నానని చెప్పు అని లేఖ రాసింది. మాధవీ లత రాసిన ఈ సూసైడ్ నోట్‌ను టూటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: పారిశ్రామిక పార్కులకు కేంద్ర సహకారం కావాలి: కేటీఆర్