ETV Bharat / jagte-raho

సరకుల కోసం ఆ స్టోర్​కు వెళితే నిలువునా దోచేస్తారు! - కరీంనగర్​ జిల్లా తాజా వార్తలు

తక్కువ ధరలో నిత్యావసరాలు లభిస్తే అంతో ఇంతో పొదుపు చేసుకోవచ్చని ఆలోచించని మధ్యతరగతి ప్రజలు ఉండరు. అందుకే నాణ్యత, ఆఫర్లు లభించే దుకాణాలకు వెళ్లడానికే ఎక్కువగా మొగ్గు చూపుతారు. అదే కారణంతో ఓ ప్రముఖ స్టోర్​కి సరకులు కొనడానికి వెళ్లిన వినియోగదారులు.. తూకాలలో యాజమాన్యం చేసే మోసాలకు మండిపడుతున్నారు. కరీంనగర్​లో ఈ ఘటన చోటు చేసుకుంది.

demarted committed cheating in weighing machines in karimnagar
తూకం విషయంలో ఆ స్టోర్​లో ప్రశ్నిస్తే పోలీస్​ స్టేషన్​కి వెళ్లాల్సిందే
author img

By

Published : Oct 11, 2020, 2:21 PM IST

కరీంనగర్​కి చెందిన ఇద్దరు మిత్రులు కలిసి నిత్యావసర సరకుల కోసం స్థానిక డీ మార్ట్ స్టోర్​కి వెళ్లారు. రూ. 2500 వరకు సరుకులు కొనుగోలు చేశారు. గోధుమపిండి తీసుకునే క్రమంలో తూకంలో మోసాన్ని గుర్తించి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. దానికి వారు ఇప్పుడే అలా వస్తుందని చెప్పి ఆ తూకాన్ని మూసేశారు.

ఈ విషయంపై ప్రశ్నించినందుకు స్టోర్​ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో వారిద్దిరనీ స్టేషన్​కి తీసుకెళ్లారు. మళ్లీ ఇలా చేయొద్దంటూ హెచ్చరించి పంపించారు.

తూకం విషయంలో ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్​కి వెళ్లాల్సిందే అని అక్కడ కొనుగోలుదారులు చర్చించుకుంటున్నారు.

తూకం విషయంలో ఆ స్టోర్​లో ప్రశ్నిస్తే​ స్టేషన్​కి వెళ్లాల్సిందే

ఇదీ చదవండి: బిహార్​ బరి: వామపక్షాలు అస్థిత్వం కాపాడుకునేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.