కుటుంబ కలహాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొల్లాపూర్ గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చీమల శ్వేత(20).. ఇంట్లో చిన్న గొడవలు జరగడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకి పాల్పడింది.
కుటుంబ సభ్యులు ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: తెరాస కార్పొరేటర్లలో ఆ 15 శాతం మంది ఎవరో అనే గుబులు!