సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన యాస్మిన్ అనే డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తన నివాసంలో తెల్లవారుజామున చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
ప్రేమ వ్యవహారంపై తల్లి మందలించడం వల్ల యాస్మిన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న బీడీఎల్ భానూరు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.