బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డి.. ఆమె బలవన్మరణంపై స్పందించారు. ఆమె ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబధం లేదని వెల్లడించారు. కుటుంబ సభ్యుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు.
ఆమె మరణానికి సాయి అనే వ్యక్తి కారణమని... ఈ విషయం తనకి ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 7న శ్రావణితో కలిసి బయటకి వెళ్లానని... అక్కడ సాయి అనే వ్యక్తి ఆమెపై చేయి చేసుకున్నాడని పేర్కొన్నారు. గతంలో తనపై తప్పుడు కేసులు బనాయించారని దేవరాజ్ వివరించారు. శ్రావణితో మాట్లాడిన చివరి సంభాషణను విడుదల చేశారు.
ఇవీ చూడండి: బుల్లి తెర నటి శ్రావణి ఆత్మహత్య.. వేధింపులే కారణమా..?