సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం స్టేజి వద్ద ఎస్ఆర్ఎస్పీ కాలువలో మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన గ్రామస్థులు శవాన్ని బయటికి తీసి పోలీసులకు సమాచారం అందించారు.
నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో ఓ నిశ్ఛితార్ధానికి ఇద్దరు వ్యక్తులు హజరయ్యారు. తమ గ్రామం అయిన జనగామ జిల్లా కడవెండికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ప్రగతినగర్ సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాల వెలుతురుకి రోడ్డు కనిపించలేదు. వెంటనే బైక్ కాలువలోకి దూసుకెళ్లడంతో ఇద్దరిలో ఒకరికి గాయాలయ్యాయి. మరొకరు నరసయ్య ఎస్ఆర్ఎస్పీ కాలువలో గల్లంతయ్యాడు. ఇవాళ మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: మోత్కూరులోని వెంకటేశ్వర మద్యం దుకాణంలో చోరీ