ETV Bharat / jagte-raho

ఉస్మాన్​నగర్​లో వరద నీటితో తేలుతున్న మృతదేహం గుర్తింపు

రంగారెడ్డి జిల్లా ఉస్మాన్​నగర్​లో వరదల వల్ల వచ్చి చేరిన నీటిలో తేలుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు పడవ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి ఉస్మానియా మార్చురీకి తరలించారు.

dead body found in osman nagar flood water in hyderabad
వరద నీటితో తేలుతున్న మృతదేహం గుర్తింపు
author img

By

Published : Oct 28, 2020, 8:00 PM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలోని వరద నీటిలో మునిగిపోయిన ఉస్మాన్​నగర్​లో నీటిలో తేలుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే బాలాపూర్​ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై స్పందించిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

స్థానికుల సహాయంతో పడవ ద్వారా మృతదేహాన్ని బయటకు తీశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడు ఎవరు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండిః పోచారం జలాశయంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.