ETV Bharat / jagte-raho

'అమ్మ కోసం అత్తింట్లో దొంగతనం... పట్టించిన సీసీ కెమెరాలు' - Theft Latest News

అప్పుల పాలైన తల్లికి సాయం చేసేందుకు అత్తింట్లో దొంగతనానికి పాల్పడిందో కోడలు. అత్తమామలు, భర్త ఇంట్లో లేని సమయంలో బంగారు నగలు, వెండి తీసుకెళ్లి తల్లికిచ్చి దొంగతనం జరిగినట్లు చిత్రీకరించింది. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడు. కానీ సీసీ కెమెరాలు మాత్రం పట్టేశాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాలు పరిశీలించగా అసలు విషయం బయటపడింది.

theft
'అమ్మ కోసం అత్తింట్లో దొంగతనం... పట్టించిన సీసీ కెమెరాలు'
author img

By

Published : Nov 27, 2020, 5:07 PM IST

హైదరాబాద్ జవహార్ నగర్ ఠాణా పరిధిలోని యాప్రాల్ కింది బస్తీలో వెంకట్ స్వామి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమారులు. కల్లు కంపౌండ్లు నిర్వహిస్తూ ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. వెంకట్ స్వామి చిన్న కుమారుడు యశ్వంత్ 2016లో సోని అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 23న బంధువుల పెళ్లి కోసం వెంకట్ స్వామి కుటుంబ సభ్యులంతా ఇంటికి తాళం వేసి వెళ్లారు. చిన్న కోడలు సోని అంతకంటే నాలుగు రోజుల ముందే తల్లిగారింటికి వెళ్లిపోయింది. వెంకట్ స్వామి, కుటుంబ సభ్యులు రాత్రి 10 గంటలకు ఇంటికి తిరిగొచ్చే సరికి తలుపు తెరిచి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూసే సరికి వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. పడకగదిలోకి వెళ్లి బీరువాను చూస్తే తెరుచుకొని ఉంది. అందులో ఉన్న బంగారు కూడా కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు వెంకట్ స్వామి గుర్తించాడు. బీరువాలో ఉన్న 44తులాల బంగారం, 15తులాల వెండి, 10500 నగదు ఎత్తుకెళ్లినట్లు వెంకట్ స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రంగంలోకి పోలీసులు

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వెంకట్ స్వామిని ప్రశ్నించారు. పెళ్లి వేడుకకు ఎవరెవరు వెళ్లారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. చిన్న కోడలు సోని తప్ప మిగతా వాళ్లందరూ పెళ్లి వేడుకకు వెళ్లినట్లు వెంకట్ స్వామి పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలతో పాటు.. చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు.

పట్టించిన సీసీ కెమెరాలు

చిన్న కోడలు సోని చోరీ జరిగిన రోజు రాత్రి 7 గంటల తర్వాత ఇంటికి వచ్చినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. సోని తన ద్విచక్ర వాహనంపై ఇంటివైపు వచ్చి ఇంటి చుట్టూ రెండు మూడు చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత గేటు తీసుకొని లోపలికి వెళ్లి వెంటనే లైట్లు ఆపేసింది. తన ఇంట్లోకి వెళ్లినట్లు ఎవరూ చూడొద్దనే ఉద్దేశంతో లైట్లను ఆపేసింది. అంతేకాకుండా సీసీ కెమెరాల్లోని దృశ్యాల్లోనూ నమోదు కావొద్దనే ముందు జాగ్రత్త తీసుకుంది. లైట్లు ఆపే లోపు తాను గేట్ తీసుకొని లోపలికి వెళ్లే దృశ్యాలు నమోదయ్యాయి. దీంతో పోలీసులు అనుమానం వచ్చి సోనీని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా సోనీ తల్లి లీలావతిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. నిందితుల నుంచి 44 తులాల బంగారం, 15 తులాల వెండి, 10వేల 500 నగదు స్వాధీనం చేసుకున్నారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాలు జరిగిన సమయంలో కీలక ఆధారాలు లభిస్తాయని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.