సైబర్ నేరగాళ్లను నమ్మి రూ. 53 లక్షలు పోగొట్టుకున్నాడు హైదరాబాద్ మూసాపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి. మూసాపేటకు చెందిన యువకుడు ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీసా కోసం యత్నిస్తున్నాడు. అందుకోసం ఆన్లైన్లో అన్వేషించాడు.
అందులో ఉన్న నంబర్లకు ఫోన్ చేసి వీసా కావాలని సంప్రదించాడు. వీసా ఇప్పిస్తామని మభ్యపెట్టిన సైబర్ నేరగాళ్లు... బాధితుడి నుంచి దశలవారీగా రూ. 53 లక్షలు వసూలు చేశారు. వీసా రాకపోవడం వల్ల మోసపోయానని గ్రహించిన బాధితుడు... సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
ఇంకొన్ని...
ఓఎల్ఎక్స్లో కారు అమ్ముతామంటూ ప్రకటన ఇచ్చిన వారిని సంప్రదించిన మరో వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 2.50 లక్షలు కాజేశారు. బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసి క్రెడిట్ కార్డు లిమిట్ రూ. 10 లక్షల వరకు పెంచుతామంటూ మరో వ్యక్తి నుంచి రూ. 1.50 లక్షలు కొట్టేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: ఎల్.రమణ