కరోనా భయంలో ప్రజలు ఉంటే.. దాన్ని సొమ్ము చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు సిద్ధమయ్యారు. మాస్కుల కొరతను అవకాశంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు.. ఆన్‌లైన్‌లో మాస్కుల కోసం సెర్చ్ చేసి, 50 పెట్టెలను ఆర్డర్ చేశాడు.
మెటీరియల్ పంపిస్తున్నామని షిప్పింగ్ పూర్తయిందని నమ్మించి.. మొత్తం రూ.4,11,000 దండుకున్నారు. మెటీరియల్ రాకపోయే సరికి మోసపోయానని తెలుసుకున్న బాధిత డాక్టర్.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:కరోనా ఎఫెక్ట్: మాస్కులు కట్టుకొని మనువాడారు!