ETV Bharat / jagte-raho

మైక్రో ఫైనాన్స్ యాప్​ల పేరిట సైబర్‌ నేరస్థుల మోసాలు - hyderabad crime news

అప్పుగా ఇస్తాం.. పది, పదిహేను రోజుల్లో చెల్లించండంటూ మైక్రో ఫైనాన్స్ యాప్​ల ద్వారా రుణాలు ఇచ్చిన కొందరు తర్వాత అందిన కాడికి దండుకుంటున్నారు. రూ. ఐదు వేలు రుణం తీసుకుంటే పదిహేను రోజుల్లో రూ.6వేలు ఇవ్వాలని.. ఇందుకోసం ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదంటూ అంతర్జాలంలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. నమ్మిన వారిని నట్టేట ముంచేస్తున్నారు. కేవలం వారం రోజుల్లోనే ఇలాంటి కేసులు 11 నమోదయ్యాయి.

CYBER CRIMES
మైక్రో ఫైనాన్స్ యాప్​ల పేరిట సైబర్‌ నేరస్థుల మోసాలు
author img

By

Published : Dec 4, 2020, 5:23 AM IST

ప్రజల అవసరాలు.. సైబర్‌ నేరగాళ్ల పాలిట వరంగా మారాయి. చిన్న మొత్తాలు అప్పుగా ఇస్తూ... మైక్రో ఫైనాన్స్‌ యాప్‌లలో సైబర్‌ నేరస్థులు మోసాలకు పాల్పడుతున్నారు. ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం ఖాతాదారుల వివరాలను సేకరించి వారికి నేరుగా రుణలిస్తామంటూ ఫోన్లు, సంక్షిప్త సందేశాలు పంపుతున్నారు.

హిమాయత్‌నగర్‌లో నివసించే లక్ష్మణ్‌.... నెలన్నర క్రితం మైక్రో ఫైనాన్స్‌ యాప్‌లో వివరాలు పంపించి.. 30 వేలు రుణం తీసుకున్నాడు. గడువులోపు చెల్లించపోవడంతో అదనంగా 30 వేలు ఇవ్వాలని సైబర్‌ నేరగాళ్లు డిమాండ్‌ చేశారు. తాను ఇవ్వనని చెప్పగా... పోలీసులకు ఫిర్యాదు చేస్తామని.. న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని బెదిరించారు.

లక్ష్మణ్‌ వద్ద నుంచి లక్షన్నర రూపాయలు వసూలు చేసిన సైబర్‌ నేరగాళ్లు.. మళ్లీ డబ్బులు ఇవ్వాలంటూ పదేపదే ఫోన్లు చేసి బెదిరించడం వల్ల అతను సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. మరో పది మంది బాధితుల ఫిర్యాదు మేరకు.... పోలీసులు కేసు నమోదు చేశారు.

వందల సంఖ్యలో మైక్రో ఫైనాన్స్‌ యాప్‌లతోపాటు... బెంగళూరు, చైన్నై, దిల్లీల్లో ఈవిధంగా మోసాలకు పాల్పడేవారు ఉన్నట్టు ఆధారాలు సేకరించారు. మరోవైపు.... పాతబస్తీకి చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం ఓ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోగా... విమానయాన సంస్థలో ఉద్యోగం పేరిట 6 లక్షల రూపాయలను సైబర్‌ నేరగాళ్లు వసూలు చేశారు. కొద్ది రోజులకే వారి ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ రావడం వల్ల మోసపోయినట్లు గుర్తించిన బాధితులరాలు.. సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించింది.

ఇవీచూడండి: పోలీసులమని బెదిరించి.. బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.