ETV Bharat / jagte-raho

ఇలా చెప్పి.. అలా దోచేస్తున్నారు... - హైదరాబాద్​ సైబర్​ నేరాల వార్తలు

ఎంత అవగాహన కల్పిస్తున్నా.. సైబర్ నేరాలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఓ రూపంలో ప్రజలు మోసపోతూనే ఉన్నారు. పోలీసుల కల్పిస్తున్న అవగాహనకు మించి సైబర్ కేటుగాళ్లు కొత్త పంథాతో బురిడీ కొట్టిస్తున్నారు.

cyber crime
cyber crime
author img

By

Published : Jun 3, 2020, 10:23 AM IST

గూగుల్‌ పే కస్టమర్‌ కేర్‌ పేరిట ఇద్దరికి సైబర్‌ కేటుగాళ్లు టోపీ పెట్టారు. భువనగిరికి చెందిన ఓ డ్రైవర్‌(32) మే 20న గూగుల్‌ పే ద్వారా తన మిత్రుడికి రూ.3వేలు పంపించాడు. ఫోన్‌ నంబర్‌ తప్పుగా నమోదు చేయడంతో గుర్తు తెలియని ఖాతాకు డబ్బులు వెళ్లాయి. ఫిర్యాదు చేసేందుకు గూగుల్‌లో కనిపించిన కస్టమర్‌ కేర్‌ నంబర్‌ 83459 89165కి కాల్‌ చేశాడు. అవతలివైపు వారు సూచించినట్లుగానే యూపీఐ ఐడీ, పిన్‌ నంబర్‌ అందజేశాడు. తీరాచూస్తే తన ఎస్‌బీఐ ఖాతా నుంచి రూ.99,480, మిత్రుడి ఐసీఐసీఐ ఖాతా నుంచి మరో రూ.17,818 కాజేశారు.

క్రెడిట్‌ కార్డు ఉందని చెప్పినందుకు..

బేగంబజార్‌కు చెందిన సిద్ధార్థ శర్మకు యాక్సిస్‌ బ్యాంక్‌లో ఖాతా ఉంది. క్రెడిట్‌ కార్డు ఉంది. రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి తాను యాక్సిస్‌ బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నానని.. మీకు క్రెడిట్‌కార్డు ఉందా అని అడిగాడు. ఉంది కానీ, రద్దు చేద్దామనుకుంటున్నట్లు శర్మ చెప్పారు. అయితే మీ మెయిల్‌ ఐడీ ఇవ్వండి. దానికో లింక్‌ పంపిస్తా. దానిపె క్లిక్‌ చేస్తే ఓటీపీ వస్తుంది చెప్పమన్నాడు. శర్మ.. మెయిల్‌ తెరిచి వచ్చిన లింక్‌పై క్లిక్‌ చేశారు. అనుమానం వచ్చి ఓటీపీ చెప్పలేదు. అయినా మోసగాళ్లు శర్మ అకౌంట్లోంచి రూ.లక్షా 12వేలు కొట్టేశారు.

కారు పేరుతో రూ.లక్షా 54 వేలు..

కారు కొందామని నాంపల్లి చెందిన లాయక్‌.. ఓఎల్‌ఎక్స్‌లో అన్వేషణ మొదలుపెట్టారు. ఓ కారు నచ్చి, దాని యజమానిగా ఆ ప్రకటనలో ఉన్న వ్యక్తిని సంప్రదించారు. వెంటనే డబ్బులు పంపిస్తే వాహనం ఇంటికి పంపిస్తానని క్విక్‌ సపోర్ట్‌ యాప్‌ వేసుకోవాలన్నాడు. ఆ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసిన కొద్ది సేపటికే లాయక్‌. ఖాతాలో రూ.లక్షా54వేలు పోయాయి.

క్విక్‌ సపోర్ట్‌ యాప్‌ పేరుతో స్వాహా..

మెహిదీపట్నానికి చెందిన ఆరీఫ్‌ హుస్సేన్‌ ఓఎల్‌ఎక్స్‌లో వాహనం కొనడానికి ప్రయత్నించారు. దాని యజమానిగా పరిచయమైన వ్యక్తి క్విక్‌ సపోర్ట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండని చెప్పి, దాని సహాయంతో అతని ఖాతాలోంచి రూ.97 వేలు కాజేశాడు.

బోడుప్పల్‌కు చెందిన ఆర్‌ఎంపీ(32) రూ.5వేలకు సంబంధించిన లావాదేవీపై ఫిర్యాదు చేసేందుకు గూగుల్‌లో కనిపించిన కస్టమర్‌ కేర్‌ నంబర్‌: 83899 72768కు కాల్‌ చేశాడు. అవతలివైపు వారు సూచించినట్లుగానే ‘క్విక్‌ సపోర్ట్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఐడీ వివరాలు చెప్పాడు. ఆంధ్రా బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.1.98 లక్షలు మాయమయ్యాయి. రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కారు కోసం అన్వేషించి..

సైదాబాద్‌కు చెందిన బి.శ్రీనివాస్‌ కారు కొందామని ఓఎల్‌ఎక్స్‌లో అన్వేషణ మొదలుపెట్టారు. ఒక ప్రకటన చూసి అందులో నంబరుని సంప్రదించారు. కారును పంపించడానికి ముందుగా డబ్బులు పంపించాలని అతను చెప్పడంతో.. శ్రీనివాస్‌ దఫదఫాలుగా లక్ష 20వేలు ఆన్‌లైన్‌ ద్వారా పంపించారు. కానీ, కారు రాలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు.

ద్విచక్రవాహనం కొందామని..

తుకారాంగేట్‌కు చెందిన రంగంపేట అనిల్‌కుమార్‌ ఓఎల్‌ఎక్స్‌లో ద్విచక్రవాహనం కొందామని యత్నించి మోసగాళ్ల చేతిలో రూ.87 వేలు పోగొట్టుకున్నారు.

ఇదీ చదవండి: సిరులు కురిపించే సింగరేణికి భారీ నష్టాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.