ETV Bharat / jagte-raho

అమాయకులే ఎర.. లక్షల రూపాయలు టోకరా... - cyber crimes in Hyderabad

అమాయకులను లక్ష్యంగా చేసుకొని సైబర్​ నేరగాళ్లు ఆన్​లైన్ ద్వారా లక్షల రూపాయలు దండుకుంటున్నారు. వారి ఆటలకు పోలీసులు అడ్డుకట్ట వేసినా.. రోజుకో రూటు మార్చి సైబర్ క్రైమ్​లకు పాల్పడుతున్నారు

cyber crimes are increasing in Hyderabad day by day
హైదరాబాద్​లో పేట్రేగిపోతున్న సైబర్ నేరగాళ్లు
author img

By

Published : Sep 3, 2020, 4:22 PM IST

పోలీసులు ఎన్నిరకాల చర్యలు చేపట్టినా అమాయకులకు వల వేసేందుకు సైబర్ నేరగాళ్లు రోజుకో పంథా అనుసరిస్తున్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్​కు చెందిన వెంకటేశ్వరరావు బ్యాంకు ఖాతా నుంచి రెండ్రోజుల్లో దాదాపు 5 లక్షల రూపాయలు మాయమయ్యాయి. ఈ మేరకు బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తన క్రెడిట్ కార్డు తన దగ్గరే ఉన్నా ఖాతాలో నుంచి 2.70 లక్షలు మాయమయ్యాయని సికింద్రాబాద్​కు చెందిన హామీద్ తెలిపారు. క్రెడిట్ కార్డు ఉపయోగించకున్నా తన ఖాతా నుంచి డబ్బు మాయమైందని హమీద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

బంజారాహిల్స్​కు చెందిన డాక్టర్ ప్రమోద్ జోషికి తన ఛైర్మన్ నుంచి ఈ-మెయిల్ వచ్చింది. అత్యవసరంగా 1.50లక్షలు అవసరమని... వెంటనే పంపించాలని అందులో ఉంది. వెంటనే ఈ-మెయిల్ లో ఉన్న బ్యాంక్ ఖాతాకు ప్రమోద్ 1.50లక్షలు బదిలీ చేశారు. మరుసటి రోజు ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఛైర్మన్​ను కలిసి... డబ్బుల గురించి ప్రస్తావించారు. తాను మెయిల్ పంపించ లేదని ఛైర్మన్​ చెప్పగా షాకైన ప్రమోద్ చేసేదేం లేక సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.