ETV Bharat / jagte-raho

లక్కీ డ్రాలో కారు వచ్చిందంటూ మోసం చేసిన సైబర్​ నేరగాళ్లు - Hyderabad crime news

షాప్​క్లూస్​ లక్కీ డ్రాలో కారు బహుమతిగా వచ్చిందంటూ ఎరవేసిన సైబర్​ నేరగాళ్లు హైదరాబాద్​ నగరానికి చెందిన ఓ మహిళ నుంచి రూ.5.7 లక్షలు కాజేశారు. ఈమెతో పాటు మరో రెండు ఉదంతాల్లో 16 లక్షలు కోల్పోయిన బాధితులు హైదరాబాద్​ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

cyber crime with lucky draw contest in hyderabad
లక్కీ డ్రాలో కారు వచ్చిందంటూ మోసం చేసిన సైబర్​ నేరగాళ్లు
author img

By

Published : Nov 5, 2020, 9:00 PM IST

సైబర్​ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతుల్లో రెచ్చిపోతున్నారు. లక్కీ డ్రాల పేరుతో ఎంతోచాకచక్యంగా డబ్బులు దోచేస్తున్నారు. సికింద్రాబాద్​ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తరచుగా షాప్​క్లూస్​ సైట్, యాప్​ల నుంచి వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల నిర్వహించిన లక్కీ డ్రాలో ఆమెకు కారు వచ్చిందంటూ ఫోన్​ వచ్చింది. కారు కావాలా? లేక దాని విలువను నగదు తీసుకుంటారా? అంటూ ప్రశ్నించారు. తనకు నగదే కావాలంటూ బాధితురాలు తెలిపగా.. ఆ ప్రాసెస్​ మొదలుపెట్టడానికి కొన్ని ఫీజులు చెల్లించాలని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఫీ, జీఎస్టీ మినహా మిగిలిన అన్ని పన్నులు రిఫండ్ అవుతాయని నమ్మబలికారు. ఇలా ఆమె నుంచి రూ.5.7 లక్షలు కాజేసి మోసం చేశారు.

మరోపక్క రుణం ఇప్పిస్తామంటూ ఫోన్​ చేసిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ఓ వ్యక్తిని నమ్మించారు. అతను ఆసక్తి చూపగా ప్రాసెసింగ్​ సహా ఇతర ఛార్జీల పేరుతో రూ.80 వేలు కాజేశారు. నగరానికి చెందిన మరో వ్యక్తికి ఫోన్​ చేసిన సైబర్​ నేరగాళ్లు క్రెడిట్​ కార్డు, కేవైసీ అప్​డేట్​ చేయాలని చెప్పారు. వీటి పేరుతో అతన్నుంచి కార్డు వివరాలు, ఓటీపీ వివరాలు తీసుకుని రూ.80 వేలు స్వాహా చేశారు. వీరి ఫిర్యాదుల మేరకు హైదరాబాద్​ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండిః బ్యాంక్ ఖాతాను అప్​డేట్​ చేస్తామని చెప్పి దోచేశారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.