ETV Bharat / jagte-raho

రుణం ఇప్పిస్తానని.. లక్ష రూపాయలు స్వాహా! - cyber crime in secundrabadd

సైబర్ క్రైమ్​పై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా... బాధితులు పెరిగిపోతూనే ఉన్నారు. తాజాగా.. బ్యాంకు అధికారినంటూ.. గ్రామీణ ఉద్యోగ సంస్థ ద్వారా రుణం ఇప్పిస్తానని ఫోన్​చేసి ఓ వ్యక్తి నుంచి లక్షానాలుగు వేల రూపాయలు దోచుకున్న సంఘటన సికింద్రాబాద్​లో చోటుచేసుకుంది.

cyber crime police got a case of cheating by the name of loan
సికింద్రాబాద్​లో రుణం ఇప్పిస్తానని లక్ష రూపాయలు టోకరా
author img

By

Published : Jul 16, 2020, 3:43 PM IST

Updated : Jul 16, 2020, 3:55 PM IST

సికింద్రాబాద్​ ఘాన్సీబజార్​కు చెందిన బబ్లూ అనే వ్యక్తికి బ్యాంక్​ అధికారినంటూ ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. రుణం ఇప్పిస్తానని నమ్మించాడు. రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్​ అని బబ్లూ నుంచి లక్షా నాలుగు వేల రూపాయలు సదరు వ్యక్తి.. తన ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.

మోసపోయానని గ్రహించిన సదరు బాధితుడు హైదరాబాద్​ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. బబ్లూ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jul 16, 2020, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.