యువతుల ఫొటోలను మార్ఫింగ్ చేసి సామజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు చేస్తున్న ఓ యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ మూసాపేట్‌కు చెందిన సాయి కుమార్ అనే వ్యక్తి... సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇన్స్టాగ్రాం నుంచి ఓ యువతి ఫోటోలు సేకరించి.. మార్ఫింగ్ చేసి నకిలీ ఖాతాల ద్వారా పోస్టులు చేశాడు. బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా... నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చూడండి: 'మా ఊర్లో కరోనా లేదు.. వెళ్లిపోండి!'