ETV Bharat / jagte-raho

'క్యూఆర్ కోడ్ సహాయంతో ఈ-సిమ్ కార్డు యాక్టివేట్'

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఓఎల్​ఎక్స్​, బహమతులు, ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెప్పి నిలువునా దోచుకుంటున్నారు. ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు సిమ్ కార్డు బ్లాక్ అయిందంటూ సందేశాలు పంపుతున్నారు. క్యూఆర్ కోడ్ సహాయంతో ఈ-సిమ్ కార్డు యాక్టివేట్ చేసి బ్యాంకు ఖాతాల నుంచి నగదును లాగేసుకుంటున్నారు.

'క్యూఆర్ కోడ్ సహాయంతో ఈ-సిమ్ కార్డు యాక్టివేట్'
'క్యూఆర్ కోడ్ సహాయంతో ఈ-సిమ్ కార్డు యాక్టివేట్'
author img

By

Published : Jul 25, 2020, 5:42 AM IST

హైదరాబాద్‌లో నమోదైన వివిధ కేసుల్లో రూ.13 లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. మియాపూర్‌లో నివాసముంటున్న అప్పలనాయుడు చరవాణికి ఈనెల 11న కేవైసీని అప్‌డేట్ చేయాలని.... లేకపోతే సిమ్ కార్డు బ్లాక్ అవుతుందని కేటుగాళ్లు సందేశం పంపారు. వినియోగదారుడి పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని.. ఆ తర్వాత వెంటనే ఈ-సిమ్ కార్డు అందిస్తామని అవతలి వ్యక్తి బుకాయించాడు. సిమ్ బ్లాక్ కావడంతోపాటు ఈ-సిమ్ కార్డు సైబర్ నేరగాడి చేతిలోకి వెళ్ళింది.

ఈ విషయాన్ని గుట్టుగా ఉంచి సైబర్ నేరగాడు గూగుల్ వ్యూ ఫామ్ పంపించి అందులో బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాల్సిందిగా సూచించాడు. ఖాతా వివరాలు, ఈ-సిమ్ కార్డు సేకరించిన సైబర్ నేరగాడు.. అతని ఖాతాల నుంచి వెంటనే రూ.తొమ్మిది లక్షలకుపైగా నగదును డ్రా చేసుకున్నాడు.

గచ్చిబౌలికి చెందిన కిషోర్ మిశ్రాకు ఈనెల 10న ఇలాంటి సందేశమే రాగా.. సూమారు రూ.6 లక్షలు పోగొట్టుకున్నాడు. సురేశ్‌ అనే మరో వ్యక్తి కూడా 2రోజుల క్రితం... ఈ తరహాలోనే రూ.లక్ష మోసపోయాడు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌కి చెందిన ఓ మహిళకు గిఫ్ట్​ వచ్చిందని రూ.6.50 లక్షలు ఆన్‌లైన్ ద్వారా దండుకున్నారు.

అప్రమత్తమైన సైబర్​ క్రైం..

యూపీఐ వాలేట్లు, ఓటీపీల పేర్లతో సైబర్ నేరగాళ్లు వినియోగదారులను అమాయకులను చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ సాయంతో వినియోగదారుల ఈ-సిమ్ కార్డును ఆక్టివేట్ చేసుకుంటున్నారు. బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేసేలా మాయ మాటలు చెబుతున్నారు. చివరికి అన్ని వివరాలు సేకరించి బాధితుల ఖాతాలో నుంచి డబ్బు మాయం చేస్తున్నారు. ఈ తరహా మోసాలు క్రమంగా పెరుగుతున్న తరుణంలో సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కేవైసీ అప్‌డేట్‌ పేరుతో వచ్చే గంపగుత్త సందేశాలను నమ్మొద్దని... ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు ఖాతా వివరాలు ఎవరికీ చెప్పొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

క్షుణ్ణంగా పరిశీలించాలి..

గుర్తుతెలియని వ్యక్తులు లింకులు పంపిస్తే వాటిని ఓపెన్ చేసే ముందు క్షుణ్ణంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సైబర్ మోసగాళ్ల బారిన పడినట్లు వినియోగదారులు గుర్తిస్తే.. వెంటనే ఈ-సిమ్ బ్లాక్ చేసేలా కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని... డబ్బుల విషయంలో మోసపోతే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇవీ చూడండి: 'మీ డబ్బు ఎవడికి కావాలి.... న్యాయం చేయండి చాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.