ETV Bharat / jagte-raho

సైబర్‌ నేరగాళ్ల ఎర.. ఆరుగురు టార్గెట్‌

సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌కు చెందిన ఆరుగురిని టార్గెట్ చేశారు. వివిధ పేర్లతో ఎర వేసి రూ. 11.77 లక్షలు కాజేశారు. వివిధ పేర్లతో నగర సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు చేరడం వల్ల కేసులు నమోదయ్యాయి. బేగంబజార్‌కు చెందిన ఓ యువకుడికి లాటరీ పేరుతో ఎర వేశారు సైబర్‌ నేరగాళ్లు. బాధితుడు ఆసక్తి చూపడం వల్ల వివిధ ఫీజుల పేరు చెప్పి దఫా దఫాలుగా రూ. 2.6 లక్షలు స్వాహా చేశారు.

సైబర్‌ నేరగాళ్ల ఎర.. ఆరుగురు టార్గెట్‌
సైబర్‌ నేరగాళ్ల ఎర.. ఆరుగురు టార్గెట్‌
author img

By

Published : Sep 25, 2020, 12:33 AM IST

హైదరాబాద్‌ లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి బ్యాంకు అధికారులమంటూ సైబర్ క్రిమినల్స్ ఫోన్ చేశారు. కేవైసీ వివరాలు అప్​డేట్​ చేయకుంటే కార్డు బ్లాక్ అవుతుందని భయపెట్టారు. కేవైసీ పేరుతో ఆయన నుంచి కార్డు వివరాలు, ఓటీపీ పంపించమని చెప్పి ఖాతాలో ఉన్న రూ. 3 లక్షలు కాజేశారు.

బేగంబజార్‌కు చెందిన మరో యువకుడికి లాటరీ పేరుతో ఎర వేశారు సైబర్‌ నేరగాళ్లు. బాధితుడు ఆసక్తి చూపడం వల్ల వివిధ ఫీజుల పేరు చెప్పి దఫా దఫాలుగా రూ. 2.6 లక్షలు స్వాహా చేశారు. ఆన్​లైన్‌లో డ్రస్ మెటీరియల్ ఖరీదు చేయడానికి ప్రయత్నించిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ. 1.3 లక్షలు పోగొట్టుకుంది. రుణం అవసరమైన ఓ నగర వాసి దాని కోసం ఆన్​లైన్‌లో ప్రయత్నించాడు. రూ. లక్ష రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సైబర్ నేరగాళ్లు ఫీజుల పేరుతో అంతే మొత్తం స్వాహా చేశారు.

గూగుల్‌లో ఉండే నకిలీ కస్టమర్ కేర్ నంబర్‌ను నమ్మి కాల్ చేసిన మరో నగరవాసి అవతలి వ్యక్తులకు తన బ్యాంకు ఖాతా వివరాలు చెప్పి రూ. 2.67 లక్షలు కోల్పోయారు. ఈ-యాడ్స్ సైట్ ఓఎల్ఎక్స్‌లో యాక్టివా 5జీ ఖరీదు చేయాలని భావించిన మరో యువకుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 1.2 లక్షలు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: పోలీసుల ముసుగులో సైబర్‌ నేరగాళ్ల కొత్త మోసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.