ఓఎల్ఎక్స్లో తక్కువ ధరకే టూ వీలర్ వాహనాల అమ్మకం అన్నఫొటోలు చూసి సంప్రదించిన హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను సైబర్ నేరగాళ్లు నిండా ముంచేశారు. వాహనం కావాలంటే ముందుగానే డబ్బులు చెల్లించాలని షరతు పెట్టి.. చివరికి పంగనామం పెట్టారు. మోసాన్ని గ్రహించలేని బాధితులు ఆన్లైన్ ద్వారా రూ.1.5 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. వాహనం రాకపోవడం వల్ల సంబంధిత నెంబర్‌ను సంప్రదించగా స్పందన లేదు. ఫలితంగా మోసపోయామని గ్రహించిన బాధితులు హైదరాబాద్ సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
మరో రెండు కేసుల్లో ఓటీపీ పేరుతో ఇద్దరు వ్యక్తుల అకౌంట్ నుంచి 1.30 లక్షలు, లోన్ పేరుతో ఓ వ్యక్తి నుంచి రూ.55 వేలు కాజేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3 కేసులపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
ఇదీచూడండి: అనవసర సైట్లు ఓపెన్ చేస్తే అంతే.. : ఏసీపీ హరినాథ్