ETV Bharat / jagte-raho

'తెలియకుండానే రూ.6 లక్షల రుణం తీసుకున్నారు' - latest cyber crimes in hyderabad

రాష్ట్రంలో సైబర్​ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి ప్రమేయం లేకుండానే సైబర్ నేరగాళ్లు అతడిపై పేరుపై ఆరు బ్యాంకుల నుంచి ఆరు లక్షల రుణం తీసుకున్నారు. పాన్​ కార్డు వివరాలు తస్కరించి లోన్లు తీసుకున్నారు.

cyber cheaters took loans without information to account holder in Hyderabad
'తెలియకుండానే రూ.6 లక్షల రుణం తీసుకున్నారు'
author img

By

Published : Sep 2, 2020, 3:51 PM IST

హైదరాబాద్​ యూసుఫ్​గూడ ప్రాంతానికి చెందిన సునిల్ కుమార్ ప్రైవేటు ఉద్యోగి. ఇటీవల ఆయన తన సిబిల్ రిపోర్ట్ చూసుకున్నారు. అందులో స్కోర్ చాలా తక్కువగా ఉండటంతో ఆరా తీశాడు. ఈ నేపథ్యంలో సునిల్ ఆరు బ్యాంకుల్లో లక్ష చొప్పున రుణం తీసుకున్నట్లు.. ఆ మొత్తాలు చెల్లించకపోవడం వల్ల డిఫాల్డ్ అయినట్లు తెలుసుకున్నాడు. అయితే ఈ రుణాల విషయం తనకు తెలియదంటూ సునిల్ వాపోయాడు.

బాధితుడి పాన్ కార్డ్ సంగ్రహించిన సైబర్ నేరగాళ్లు... ఇతడి వివరాలు వినియోగించి ఆన్​లైన్​లో ఇన్​స్టంట్ లోన్ సదుపాయంతో ఈ రుణాలు పొందారని వెల్లడైంది. ఈ మేరకు సునీల్​ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది.. రుణం ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్లింది... తదితర అంశాలు ఆరా తీయనున్నారు.

ఇదీ చూడండి : ఆ యాప్​ సాయంతో.. సులభంగా సరకు రవాణా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.