హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకుల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. జూబ్లీహిల్స్‌కు చెందిన రచనకు ఓ జాతీయ బ్యాంక్‌లో కరెంట్ అకౌంట్ ఉంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి బ్యాంకు నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మించాడు. మీ డెబిట్ కార్డుకు వాల్యుయాడేడ్ పాయింట్స్ బాగా వచ్చాయి. వాటిని మీ డెబిట్ కార్డుకు జోడించాలంటే... కార్డు సీవీవీ నంబరు చెప్పాలన్నాడు. ఆమె అమాయకంగా ఆ నంబర్లు చెప్పింది. దీంతో రచన ఖాతాలోని రూ.55 వేలు మాయమయ్యాయి.
బతుకమ్మకుంటకు చెందిన వినీత్... అన్లైన్లో ఓ కంపెనీ నుంచి వర్క్ ఫ్రం హోం జాబ్ పొందాడు. వినీత్ ఎంతో కష్టపడి నిర్ణీత సమయానికి పని పూర్తి చేశాడు. కానీ... ఆ కంపెనీ ప్రతినిధి తాము అప్పగించిన పనుల్లో అన్నీ తప్పులే ఉన్నాయని... దీనికి తగిన మూల్యం చెల్లించాలని బెదిరింపులకు పాల్పడుతుండటంతో భయపడిన వినీత్... తిరిగి ఆ కంపెనీ ప్రతినిధికి రూ.25 వేలు చెల్లించాడు. ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించడం వల్ల బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పంజాగుట్ట ఆదర్శనగర్‌కు చెందిన విజయనారాయణ కారు కొనుగోలు చేద్దామని ఓఎల్ఎక్స్లో చూశారు. అందులో ఓ కారు కనిపించింది. రూ. 2.50 లక్షలకు కారు బేరమాడుకున్నారు. వెంటనే విజయనారాయణ ఆ మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత ఎంతకాలం ఎదురు చూసినా కారు రాలేదు. అవతలి వ్యక్తికి ఫోన్ చేస్తే స్వీచ్ ఆఫ్ వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.