ETV Bharat / jagte-raho

ఇ-మెయిళ్లు హ్యాక్‌ చేస్తూ.. రూ.లక్షలు కొట్టేస్తూ..!

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. రూటు మార్చి బురిడి కొట్టి దొరికిన కాడికి దోచేస్తున్నారు. కార్పొరేటు సంస్థల ఈ మెయిళ్లు హ్యాక్​ చేస్తూ లక్షలు కొల్లగొడుతున్నారు.

cyber crime
cyber crime
author img

By

Published : Jun 15, 2020, 6:25 AM IST

సైబర్‌ నేరాలకు పాల్పడే నైజీరియన్లు లాక్‌డౌన్‌ వేళ పంథా మార్చారు. ముంబయికి మకాం మార్చి.. ప్రైవేటు, కంపెనీలు, కార్పొరేటు సంస్థలు ఇ-మెయిల్స్‌ను హ్యాక్‌ చేసి రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. ఏఏ సంస్థలు, కంపెనీలతో రూ.లక్షల్లో నగదు లావాదేవీలు చేస్తున్నారో గుర్తించి నకిలీ మెయిల్స్‌ పంపించి నగదును వారి ఖాతాల్లోకి వేయించుకుంటున్నారు.

వారం రోజుల్లో ఇద్దరి ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతాల్లోంచి రూ.88 లక్షలు బదిలీ చేసుకున్నారు. వీటిని కోల్‌కతా, ముంబయి, దిల్లీలోని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకున్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. ఈ రెండు ఘటనల్లోనూ ఐపీ చిరునామాలు ముంబయివి ఉన్నాయని ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ తెలిపారు.

ఓటీపీలు రాకుండా చేసి...

బాధితుడు: బంజారాహిల్స్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌

నష్టపోయింది: రూ.50 లక్షలు

ఎలా:

  1. యాహూ మెయిల్‌ హ్యాక్‌ చేశారు.
  2. చరవాణి నంబరు తెలుసుకున్నారు.
  3. సంబంధిత నెట్‌వర్క్‌ కార్యాలయానికి ఫోన్‌ చేసి చరవాణిని స్తంభింపజేశారు.
  4. రెండు దఫాలుగా డబ్బు కొల్లగొట్టారు.
  5. తరవాత చరవాణి పనిచేయించాలని కోరారు.

ఓవర్‌ డ్రాఫ్ట్‌ బ్యాంక్‌ ఖాతాలపై సైబర్‌ నేరస్థుల గురి పెడుతున్నారు. మెయిల్‌లోని బ్యాంకు ఖాతా పాస్‌వర్డ్‌ ద్వారా దోచేస్తున్నారు.

బాధితుడు: సికింద్రాబాద్‌కు చెందిన ఇనుము వ్యాపారి

నష్టపోయింది: రూ.38 లక్షలు

ఎలా:

  1. ఇ-మెయిల్‌ హ్యాక్‌ చేశారు.
  2. అందులోని బ్యాంకు ఖాతా పాస్‌వర్డు తెలుసుకున్నారు.
  3. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ను పరిశీలించారు.
  4. చరవాణికి ఓటీపీలు రాకుండా చేశారు.
  5. కోల్‌కతాలో సంతోష్‌శర్మ, జితేందర్‌, సందీప్‌ పేర్లతో ఉన్న ఖాతాల్లోకి రూ.38 లక్షలు బదిలీ చేసుకున్నారు.

ఇదీ చదవండి: తెలంగాణపై కరోనా పంజా... కొత్తగా 237 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.