ETV Bharat / jagte-raho

ఐపీఎల్​ బెట్టింగ్​ ముఠా అరెస్ట్​... తొమ్మిది లక్షలు స్వాధీనం - IPL betting racket busted in hyderabad

ఐపీఎల్​-13 నేపథ్యంలో క్రికెట్​ బెట్టింగ్​ నిర్వహిస్తున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిది మంది నుంచి రూ.9 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

cricket betting gang arrested in hyderabad
ఐపీఎల్​ బెట్టింగ్​ ముఠా అరెస్ట్​... తొమ్మిది లక్షలు స్వాధీనం
author img

By

Published : Oct 9, 2020, 5:10 PM IST

ఐపీఎల్ నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్ల ఆగడాలు పెరుగుతున్నాయి. వారి ఆటలకు కళ్లెం వేసేందుకు పోలీసులు నిఘా నేత్రాలతో బెట్టింగ్ నిర్వాహకుల సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. అల్వాల్ పీఎస్​ పరిధిలోని భూదేవి నగర్​లో హైదరాబాద్-పంజాబ్ మ్యాచ్​పై భారీగా బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారంతో బాలనగర్​ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు.

భూదేవి నగర్​లోని ఓ ఇంట్లో బెట్టింగ్​ నిర్వహిస్తున్న ముఠాను బాలనగర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 9 మంది నుంచి తొమ్మిది లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని ఎస్వోటీ పోలీసులు అల్వాల్ పోలీసులకు అప్పగించారు.

ఇవీ చూడండి: కీలక దశకు సీఎంఆర్​ఎఫ్​ కుంభకోణం కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.