ETV Bharat / jagte-raho

ఆవును చంపిన కేసులో నలుగురికి రిమాండ్​ - వికారాబాద్ దామగుండం అటవీ ప్రాంతంలో ఆవును చంపిన దుండగులు

వికారాబాద్​ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో ఆవుపై దాడి చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. గత నెల 24న ఐదుగురు వ్యక్తులు.. ఆవును తుపాకీతో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.

cow kill case accused sent to remand in vikarabad district
ఆవును చంపిన కేసులో రిమాండ్​కి నలుగురు నిందితులు!!
author img

By

Published : Nov 1, 2020, 2:19 PM IST

వికారాబాద్​ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో ఆవును చంపిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు రిమాండ్​కు తరలించారు. గత నెల 24న ఐదుగురు వ్యక్తులు.. అటవీ ప్రాంతంలో ఆవును తుపాకీతో కాల్చి చంపారు.

వారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. వీరిలో ఇద్దరు హైదరాబాద్​కు చెందిన వారు కాగా ముగ్గురు తిర్మలాపూర్ గ్రామానికి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. అసలు నిందితుల్ని వదిలేసి తమ వాళ్లని పట్టుకున్నారంటూ తిర్మలాపూర్​ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి: తెలంగాణ ఇంటలిజెన్స్​ చీఫ్​గా ప్రభాకర్​రావు నియామకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.