కామారెడ్డి జిల్లాలో జరిగిన ఓ పెళ్లిలో బంధువుల రూపంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. బంధువులు గమనించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
అసలు దొంగతనం ఎలా జరిగిందంటే?
కామారెడ్డి అయ్యప్ప ఫంక్షన్హాల్లో జరిగిన పెళ్లిలో బంధువులుగా చెప్పుకుంటూ... పెళ్లి కుమార్తె బంధువులకు సంబంధించిన మూడు తులాల బంగారాన్ని దంపతులు దొంగలించారు. దీన్ని గమనించిన బంధువులు... బంగారం దొంగిలించిన వారిని పట్టుకుని చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బంగారాన్ని దొంగలించిన దంపతులు ఇందిరానగర్ కాలనీకు చెందిన పరమేశ్, యశోదలుగా గుర్తించారు.