ETV Bharat / jagte-raho

విషాదం.. చిన్నారితో పాటు దంపతుల ఆత్మహత్య - family suicide in mahabubabad district

family suicide in mahabubabad district
family suicide in mahabubabad district
author img

By

Published : May 20, 2020, 9:06 PM IST

Updated : May 20, 2020, 11:49 PM IST

21:05 May 20

విషాదం.. చిన్నారితో పాటు దంపతుల ఆత్మహత్య

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం మన్నెగూడెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొమ్మిది నెలల చిన్నారితో సహా తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మన్నెగూడెం గ్రామానికి చెందిన అక్కి రాంబాబు, ఆయన భార్య కృష్ణవేణి, కుమార్తె ఛైత్రిక ద్విచక్ర వాహనంపై... కృష్ణవేణి తల్లిగారి ఊరైన చిలుకోయలపాడు నుంచి మన్నెగూడెం బయలుదేరారు.  

ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్లకుండా నేరుగా మార్గమధ్యలో చెరువు సమీపంలోని తమ వ్యవసాయ భూమి వద్దకు చేరుకున్నారు. అక్కడ తమ కుమార్తె ఛైత్రికను చంపి నీటి కుంటలో పడేశారు. అనంతరం దంపతులు ఇద్దరూ ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి మరో మూడేళ్ల కుమార్తె వైష్ణవి ఉంది.  

ఆత్మహత్యకు ముందు రాంబాబు తన మరదలికి ఫోన్‌ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలే వీరి మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.  

Last Updated : May 20, 2020, 11:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.