ETV Bharat / jagte-raho

పెళ్లితో ఒక్కటి కాలేక.. చావులో ఒక్కటయ్యారు! - సంగారెడ్డి జిల్లా వార్తలు

couple-commits-suicide-in-rangareddy-district
పురుగుమందు తాగి 'జంట' ఆత్మహత్య
author img

By

Published : Nov 16, 2020, 9:06 AM IST

Updated : Nov 16, 2020, 10:56 AM IST

09:00 November 16

'జంట' ఆత్మహత్య

ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఒకే ఆలోచనలు ఉండడంతో స్నేహితులయ్యారు. ఆ బంధం ప్రేమకు దారితీసింది. పెళ్లితో ఒక్కటై.. తుదిశ్వాస వరకూ కలిసే ఉండాలని ఆశపడ్డారు. కానీ... పెద్దలు అడ్డుచెప్పారు. ఆమెకు మరొకరితో వివాహం జరిపించారు. ఇది ఎనిమిదేళ్ల కింద ముచ్చట. ఆమెకు ఐదేళ్ల బాబు.  

మనుషులు వేరైనా మనసులు మాత్రం ఒకచోటే ఉన్నాయి. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆమె ఎన్నిసార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఎనిమిదేళ్ల తర్వాత ఇక వేరుగా ఉండలేమని నిర్ణయించుకున్నారు. కలిసి బతకలేమని నిర్ణయించుకుని.. కలిసి కడతేరారు. పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. తల్లే ప్రపంచంగా బతుకున్న కొడుకు.. ఆమెకు గుర్తుకు రాకపోవడం బాధాకరం.  

రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవులలో ఇద్దరి మృతదేహాలు కలకలం రేపాయి. ఆ ఇద్దరిదీ సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంగా పోలీసులు నిర్ధరించారు. కవ్వపల్లికి చెందిన సంపత్, సదాశివపేటకు చెందిన పార్వతి చదువుకునే అప్పటి నుంచే ప్రేమించుకున్నారు. విషయం ఇంట్లో తెలిసింది. తల్లిదండ్రులు ప్రేమ పెళ్లి ససేమిరా అన్నారు. ఆమెకు మరొకరితో పెళ్లి చేసేశారు. పార్వతికి 5 సంవత్సరాల కొడుకు. ఆమె ఈనెల 6న ఇంటి నుంచి వెళ్లిపోగా... కుటుంబసభ్యులు 7వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

శనివారం సంపత్, పార్వతి కలిసి నార్సింగి పోలీస్​స్టేషన్​ పరిధిలోని వీరభద్రస్వామి ఆలయంలో పురుగుల మందు సేవించారు. అనంతరం సంపత్ అతని తండ్రికి ఫోన్​లో సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకునే సరికి వీరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చూడండి: మహారాష్ట్రలో దారుణం-యువతిపై యాసిడ్​, పెట్రోల్​ దాడి

Last Updated : Nov 16, 2020, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.