బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. నిందితులు సాయిరెడ్డి, దేవరాజ్ రెడ్డికి అమీర్‌పేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్‌గా నిర్ధరణ అయింది.
నిందితులిద్దరినీ న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. అంతకు ముందు శ్రావణి తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలం రికార్డు చేశారు. ఈ కేసులో అన్ని కోణాల్లో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
ఇదీ చూడండి: మరో యువతితోనూ దేవరాజ్ ప్రేమాయణం