రంగారెడ్డి షాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న కానిస్టేబుల్ మృతి చెందాడు. షాబాద్ మీదుగా వెళ్తున్న ఓ లారీ... హరిజనవాడ వద్ద సడెన్ బ్రేక్ వేయటం వల్ల ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొట్టింది. అదే సమయంలో కానిస్టేబుల్ శ్రీశైలం ద్విచక్రవాహనంపై అటుగా వెళ్తున్నాడు.
ఒక్కసారిగా లారీ బోల్తాపడటం వల్ల ద్విచక్రవాహనం అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీశైలం ఛాతిలో బలమైన గాయమైంది. చికిత్స నిమిత్తం చేవెళ్ల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కానిస్టేబుల్ శ్రీశైలం షాబాద్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకుని స్వగ్రామం వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలంకు భార్య, కుమార్తె ఉన్నారు.
![constable died in road accident at shabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8585314_942_8585314_1598592231008.png)
![constable died in road accident at shabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8585314_347_8585314_1598592259973.png)