విహహితపై ఓ కానిస్టేబుల్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన సైదాబాద్ పోలీస్ ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం సైదాబాద్ పరిధి పూసలబస్తీ ప్రాంత నివాసి పులిమామిడి వెంకటేష్ ( 48 ) మాదన్నపేట పోలీస్ రాణాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
గతేడాది భార్య అనారోగ్యంతో మరణించగా.. మరో వివాహం చేసుకున్నాడు . అతని ఇంటి సమీపంలో నివసిస్తున్న వివాహితురాలు ( 32 ) కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటూనే ఆమెను శారీరకంగా .. మానసికంగా వేధించటంతో వేరే బస్తీకి మకాం మార్చారు. గతనెల 26 న ఇంట్లో భర్త లేని సమయం చూసుకుని ఆమె వద్దకు వెళ్లాడు. ఆమె ముగ్గురు పిల్లల ముందే గదిలోకి లాక్కెళ్లి అత్యాచారయత్నం చేయబోయాడు. పిల్లులు స్థానికులకు సమాచారం అందించగా వారు సైదాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి:రెండు పెళ్లిళ్లు చేసుకున్న భర్తకు భార్యల దేహశుద్ధి