ETV Bharat / jagte-raho

కాంగ్రెస్ నేత హత్య కేసు.. ఐదు రోజుల్లోనే ఛేదించిన పోలీసులు - నిజమాబాద్ కాంగ్రెస్ లీడర్ హత్య కేసు

నిజమాబాద్ జిల్లా కాంగ్రెస్ నేత, కిసాన్ కేత్ మండల అధ్యక్షుడు డీపీ గంగారాం హత్య కేసును ఐదు రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. భార్య, అల్లుడు కలిసి మరో ఇద్దరి సహకారంతో హత్య చేసినట్లు ఎస్సై శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో ఈనెల 9న జరిగిన హత్య చోటుచేసుకుంది.

http://10.10.50.85:చోటుచేసుకుంది/reg-lowres/14-August-2020/tg_nzb_18_14_aidhu_rojullo_hathya_casu_chedhana_avb_ts10136_sd_360p_1408digital_1597416815_1008.mp4
చోటుచేసుకుంది
author img

By

Published : Aug 14, 2020, 11:37 PM IST

నిజమాబాద్ జిల్లా కాంగ్రెస్ నేత, కిసాన్ కేత్ మండల అధ్యక్షుడు డీపీ గంగారాం హత్య కేసును ఐదు రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. భార్య, అల్లుడు కలిసి మరో ఇద్దరి సహకారంతో హత్య చేసినట్లు ఎస్సై శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో ఈనెల 9న జరిగిన హత్య చోటుచేసుకుంది.

గంగారాం కూతురు శ్రుతిని ఫిబ్రవరిలో గడుగు రాజు అలియాస్ దామ శ్రీకాంత్ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి ఇష్టం లేని గంగారాం దంపతులిద్దరికీ... గ్రామంలో అద్దెకు ఇల్లు దొరకకుండా, పని దొరకకుండా ఇబ్బందులకు గురి చేశాడు. కూతురి జీవితాన్ని పాడు చేయోద్దని వారించిన భార్య రామలక్ష్మిని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.

ఆమె సీతపేట గణేశ్ కు తన భర్తను అల్లుడు రాజుతో కలిసి చంపివేయాలని.. ఇందుకు రూ. 90వేలు చెల్లిస్తానని ఒప్పందం చేసుకుంది. గంగారాం కదలికలను తెలుసుకోవడానికి గణేశ్.. ఆసాది శేఖర్ అనే వ్యక్తికి రూ.24 వేలతో ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి ఇచ్చారు. శేఖర్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈనెల 9న పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న గంగారాంను మార్గమధ్యలో రాజు, గణేశ్ లు ఇనుప రాడ్లతో తలపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. రాజు, గణేశ్, శేఖర్ లతోపాటు మృతుడి భార్య రామలక్ష్మిలను జిల్లా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. నలుగురు నిందితులకు విధించినట్లు చెప్పారు. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేసు నుంచి ఐదు రోజుల్లోనే చేయించినట్లు ఎస్ఐ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.