వరద బాధితులకు పరిహారం పంపిణీ చేస్తున్న సమయంలో జరిగిన వాగ్వాదంలో ముగ్గురు గాయపడిన ఘటన పాతబస్తీ కమాటిపురా ఠాణా పరిధిలో జరిగింది. దేవిబాగ్ హరిజన్ కాలనీలో కొంత మందికి అధికారులు వరద పరిహారం అందించారు. అధికారుల సూచన మేరకు మిగిలిన లబ్ధిదారుల పేర్లను కాలనీకి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి నమోదు చేస్తున్నాడు. ఈ క్రమంలో బహదుర్‌పుర పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ బాబురావు... అతడి కుటుంబీకులు తమ పేర్లును రాయాలని కోరారు.
అప్పటికే వారికి పరిహారం అందిందని సదరు వ్యక్తి తెలపగా.. కానిస్టేబుల్, అతని కుమారులు దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. ఈ దాడిలో ప్రభాకర్, అతడి ఇద్దరి కుమారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: విశ్రాంత అదనపు ఎస్పీపై కేసు నమోదు