స్థలవిషయంలో రెండు వర్గాల మధ్య వార్.. అడ్డుకున్న పోలీసులు - Hyderabad Crime News
హైదరాబాద్ మారేడుపల్లి రెవెన్యూ కార్యాలయం సమీపంలో స్థల వివాదం చోటుచేసుకుంది. రెండు వర్గాలు ఆ స్థలం నాదంటే నాది అని... గొడవకు దిగారు. దీనితో సమాచారం అందుకున్న పోలీసులు... గొడవను సద్దుమణిగించారు.
హైదరాబాద్ మారేడుపల్లి రెవెన్యూ కార్యాలయం... తుకారాంగేట్ పోలీస్స్టేషన్ల వెనుకవైపు మహేంద్రాహిల్స్ సర్వే నంబరు 74/9, 74/10ల మధ్య వివాదం 74/9 స్ధలం చుట్టు ప్రహారిగోడను కూల్చివేసేందుకు హరిరాం ప్రచార సమితి సభ్యులు జేసీపీతో వచ్చారు. ఈ స్ధలం నాది అంటూ స్ధల యజమాని గొడవకు దిగారు. దీనితో దాదాపు మూడు గంటల పాటు ఉద్రికత్తత ఏర్పడింది.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే పోలీస్స్టేషన్ వెనుక వైపు ఇంత గొడవ జరుగుతుంటే పోలీసులు ఆలస్యంగా వచ్చారు. ఎమ్మార్వో సమయానికి అందుబాటులో లేకపోవడం వల్ల ఆందోళన ఎక్కువైంది. స్ధల యజమాని.. ట్రస్ట్ అధ్యక్షుల మధ్య స్ధలం కోసం మాటల యుద్దం నెలకొంది. ఇవాళ తెల్లవారుజామున జేసీబీలతో 74/9లో ఉన్న ప్రహరీగోడల్ని ట్రస్ట్ సభ్యులు కూల్చివేసేందుకు వచ్చారు.
ఈ స్ధలం పక్కనే మహేంద్రాహిల్స్ కల్లు కాంపౌండ్ షెడ్డులను కూల్చివేశారు. దానితో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ సీఐ ఎల్లప్ప రెండు వర్గాల మధ్య రాజీకి ప్రయత్నించారు. పోలీస్ స్టేషన్‌లో ఒకరునొకరు ఫిర్యాదు చేసుకోవాలని ఈ స్ధలం ఎవరిదో ఎమ్మార్వో ద్వారా విచారణ చేయిస్తామన్నారు. ఎవరైనా గొడవలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
ఇదీ చూడండి:- ముఫ్తీ 'జెండా' వ్యాఖ్యలపై భాజపా ఫైర్