ఆకాశ్, శుభంలు కొద్దిరోజులుగా ఒకరిపై మరొకరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణలతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఇద్దరూ కలిసి మాట్లాడుకుందామని ఇందిరానగర్‌లోని ఆకాశ్ ఇంటికి తమ స్నేహితులతో చేరుకున్నారు.
మాట్లాడుతున్న క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి: దగ్గు మందు అమ్మినందుకు మెడికల్‌షాప్ యజమాని అరెస్ట్