నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దాదాపు రూ.30 వేల నగదు, 10 తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లు బాధితురాలు వెల్లడించింది. సనత్‌నగర్ పీఎస్ పరిధిలోని అల్లాపూర్ డివిజన్లోని హరినగర్‌లో స్వాతి అనే యువతి నివాసముంటోంది.
యువతి వృత్తిరీత్యా బెంగళూరుకు వెళ్లి వచ్చేలోగా ఇంట్లో దొంగతనం జరిగింది. దీంతో బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.