ETV Bharat / jagte-raho

ఉద్రిక్తత: ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్థులు

అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఇసుక ట్రాక్టర్​లని గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలో చోటుచేసుకుంది. ఇసుక ట్రాక్టర్​లను అడ్డుకోవటంతో గ్రామంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

chinna vaddemama villagers blocking illegal sand smuggling in mahabubnager
ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్​లని అడ్డుకున్న గ్రామస్థులు
author img

By

Published : Jan 17, 2021, 4:21 PM IST

అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఇసుక ట్రాక్టర్​లని గ్రామస్థులు అడ్డుకున్నారు. మహబూబ్​నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం మధ్య గుండా ఊక చెట్టు అనే వాగు ప్రవహిస్తుంది. అక్కడి నుంచి మండలంలోని దమాజ్ఞాపూర్ గ్రామస్థులు ఇంటి నిర్మాణం కోసం వాగు పరివాహక గ్రామమైన చిన్న వడ్డెమాను గ్రామం నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు.

కాసేపు ఉద్రిక్తత..

ఇది తెలిసి వడ్డెమాను గ్రామస్థులు ట్రాక్టర్​లను అడ్డుకున్నారు. ఇసుక ట్రాక్టర్​లను అడ్డుకున్న సంఘటనతో గ్రామంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులకు, ఇసుక తరలించే వారి మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి ఇసుక తీసుకెళ్లేందుకు వచ్చిన వారు తిరిగి వెళ్లిపోవటంతో గ్రామస్థులు శాంతించారు.

ఇదీ చూడండి: జువెలరీ షాప్​ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.