ETV Bharat / jagte-raho

దా'రుణ' యాపుల్లో డ్రాగన్​ వ్యక్తులదే కీలక పాత్ర... - రుణ యాపుల్లో చైనా వాళ్లదే కీలక పాత్ర

ఆన్‌లైన్‌ రుణ యాప్‌లను ఎక్కువ శాతం చైనా దేశీయులే నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. సైబర్‌ క్రైం పోలీసులు పట్టుకున్న నలుగురు సభ్యుల ముఠా వ్యవహారంలోనూ డ్రాగన్‌ వ్యక్తులే కీలక పాత్ర పోషిస్తున్నట్టు బయటపడింది. దిల్లీ, గురుగ్రామ్‌, హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న కాల్‌సెంటర్ల ద్వారా రుణాలు తీసుకున్న వారిని... ఈ ముఠా వేధిస్తోంది. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విచారణ బృందం.... తీగ లాగినా కొద్ది డొంక కదులుతోంది.

china persons playing key role in online loan apps

author img

By

Published : Dec 25, 2020, 8:55 PM IST

దా'రుణ' యాపుల్లో డ్రాగన్​ వ్యక్తులదే కీలక పాత్ర...

రుణ యాప్‌ల వ్యవహారంలో నలుగురు సభ్యుల ముఠా... సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు చిక్కింది. చైనాకు చెందిన జిక్సియ జాంగ్‌ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు పలు ఆసక్తికర విషయాలను​ వెల్లడించారు. రాజస్థాన్‌, దిల్లీకి చెందినవారితో కలిసి ఇతను 'స్కై ఇన్నోవేషన్‌ టెక్నాలజీ, గ్జికాయి హోల్డింగ్‌' పేరిట రెండు డిజిటల్‌ కంపెనీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అందుకు సంబంధించి గురుగ్రామ్‌, హైదరాబాద్‌లో రెండు కాల్‌సెంటర్లు ఏర్పాటుచేసి రుణాలు తీసుకున్న వారిని వేధించేవాడని తమ దర్యాప్తులో తేలినట్లు చెప్పారు. మరో చైనా వాసి ఫిబ్రవరిలో హైదరాబాద్‌ వ్యాపార వీసాపై వచ్చి ఈ ముఠాతో చేరాడన్నారు. ఎప్పటికప్పుడు కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటూ వీరు తమ వ్యాపారాన్ని విస్తరించుకున్నట్లు తేలిందన్నారు. లోన్‌ గ్రామ్‌, క్యాష్‌ ట్రెయిన్‌, క్యాష్‌ బస్సు, ఏఏఏ క్యాష్‌, సూపర్‌ క్యాష్‌, మింట్‌ క్యాష్‌, హ్యాపి క్యాష్‌, లోన్‌కార్డు రీపేవన్‌, మనీ బాక్సు, మంకీ బాక్సు పేరిట పదకొండు ఆన్‌లైన్‌ యాప్‌లు సృష్టించారని వెల్లడించారు.

గూగుల్​కు లేఖ...

40 ఏళ్ల లోపు ఉన్నవారినే లక్ష్యంగా చేసుకుని రుణాలు ఇస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ రుణవ్యాపారానికి నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయనే అంశంపై పోలీసులు దృష్టిసారించారు. సింగపూర్‌, చైనా నుంచి నిధులు వస్తున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యవహారాన్ని ఆర్బీఐ దృష్టికి పోలీసులు తీసుకువెళ్లారు. మరోవైపు 116 యాప్‌లు తొలగించాలని గూగుల్‌కు లేఖ రాశారు. ఈ ముఠాలో చైనాకు చెందిన ముంబాయి, రాజస్థాన్‌ వాసులు సత్యపాల్‌, మల్హొత్రా, కడప వాసి హేమంత్‌ సేఠ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు లాప్‌టాప్‌లు, నాలుగు చరవాణులు, బ్యాంకు ఖాతాలోని 2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న చైనాకు చెందిన జిక్సియ జాంగ్‌, దిల్లీ వాసి ఉమాపతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ప్రజలు ఆన్‌లైన్‌ రుణాల యాప్‌ల ఉచ్చులో చిక్కుకోవద్దని, చరవాణుల సందేశాల్లో వచ్చే లింక్‌లను క్లిక్‌ చేయవద్దని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. అనుమానం వస్తే డయల్‌ 100, సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.

ఇదీ చూడండి: రుణ యాప్‌ల వ్యవహారంలో మరో ముగ్గురి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.