పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన పుత్తూరు శ్రీనివాస్ గుట్కా వ్యాపారం నిర్వహించేవాడు. గుట్కా స్థావరాలపై పోలీసుల దాడులు పెరగడం వల్ల దందాను మూసివేశాడు. కొంత మంది యువకులతో చేరి ఆన్లైన్ రమ్మీ ఆట మొదలుపెట్టాడు. విలాసవంతమైన భవనంలో క్యూఆర్ కోడ్ స్కానర్‌తో, తన బ్యాంక్ అకౌంట్లో నగదు జమయ్యేలా ఏర్పాట్లు చేశాడు.

ఇలా ఎంతో మంది ఆన్లైన్ రమ్మీ ఆట ద్వారా శ్రీకాంత్ మోసగించాడని రామగుండం డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. రాజస్థాన్ జైపూర్‌లో రమ్మీ ఫ్యామిలీ పేరిట యాప్‌ను తయారు చేసి లైసెన్స్ తీసుకున్నట్లు వెల్లడించారు. దాదాపు మూడు కోట్ల వరకు నగదు చేతులు మారిందని చెప్పారు. దీనిపై విచారణ చేయనున్నట్లు పేర్కొన్నారు.

శ్రీకాంత్‌తో పాటు సాయి తేజ, సందీప్, మహమూద్ హజ్రత్, అంజిలను అరెస్టు చేసినట్లు డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. వారి నుంచి నాలుగు సెల్ఫోన్లు, మల్టీ ఛార్జర్ సాకెట్లు, స్కానర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దొంగ యాప్‌లను నమ్మి యువత మోసపోకూడదని సూచించారు.