భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట వద్ద ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టును మణుగూరు పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేందుకు పేలుడు సామాగ్రిని తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వ్యక్తి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా పెద్దబొడికెల్ గ్రామానికి చెందిన హేమల జోగగా గుర్తించారు. అతను గత ఏడేళ్లుగా మావోయిస్టు మిలిషియా కమాండర్‌గా పనిచేస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అతని వద్ద నుంచి 5 జిలెటిన్ స్టిక్స్, 100 మీటర్ల వైరు, టిఫిన్ బాక్స్, రెండు డిటోనేటర్లు, రెండు బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్లు మణుగూరు ఏఎస్పీ శబరీశ్ వెల్లడించారు.
అతనిపై ఛత్తీస్‌గఢ్‌లో 4 హత్య కేసులు, రెండు ఎక్స్‌కర్షన్స్, బ్లాస్టింగ్ కేసులున్నాయని ఏఎస్పీ తెలిపారు. మావోయిస్టులకు ఎవరైనా వారికి సహకరిస్తే కఠినచర్యలు తీసుకుంటామని శబరీష్ హెచ్చరించారు.