ETV Bharat / jagte-raho

హైదరాబాద్​లో మళ్లీ చెలరేగుతూ దడ పుట్టిస్తున్న గొలుసు దొంగలు - మపోగల ూపాగనాే గల పబ్ాీోవో్

నగరంలో నిన్న.. మొన్నటి వరకు వెనక్కి తగ్గినట్లే కనిపించిన గొలుసు దొంగలు మళ్లీ చెలరేగిపోతున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు పట్టుకుంటూనే ఉన్నా ఎక్కడో చోట మెరుపువేగంతో తెంపుకెళ్లిపోతున్నారు. గురువారం చింతల్‌లోని ఓ బొమ్మల దుకాణంలో ఉన్న మహిళపై కారం చల్లి గొలుసును దొంగిలించేందుకు యత్నించడం కలకలం సృష్టించింది.

Chain robbers erupting again in Hyderabad
హైదరాబాద్​లో మళ్లీ చెలరేగుతూ దడ పుట్టిస్తున్న గొలుసు దొంగలు
author img

By

Published : Oct 9, 2020, 9:56 AM IST

భాగ్యనగరంలో ఎప్పటికప్పుడు పోలీసులు గొలుసు దొంగలను పట్టుకుంటూనే ఉన్నా.. ఎక్కడో ఒక చోట గొలుసులను తెంపుకెళ్తున్నారు. ఇటీవల కాలంలో ఇలా..

  • పదిరోజుల కిందట రాజేంద్రనగర్‌ ఠాణా కిస్మత్‌పూర్‌లో రాత్రి 9 గంటల సమయంలో కిరాణ దుకాణంలో ఉన్న మహిళ మెడలో నుంచి గొలుసును తెంపుకెళ్లారు. ఇప్పటికీ నిందితుల్ని గుర్తించలేదు.
  • కొన్ని రోజుల కిందట చింతల్‌ ఎల్లమ్మ గుడి రోడ్డు ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద ఉదయపు నడకకు వెళుతున్న మహిళ మెడలో గొలుసును దొంగిలించి మెరుపు వేగంతో పరారయ్యారు. ఇంకా చిక్కలేదు.
  • సెప్టెంబరు 30న మల్కాజ్‌గిరి చాణిక్యపురి కాలనీలోని గ్రాండ్‌ అపార్ట్‌మెంట్‌ కింద జామ ఆకులు కోస్తున్న పి.సువర్ణ(56) మెడలో నుంచి మెరుపు వేగంతో మంగళసూత్రాన్ని(విలువ రూ.90వేలకు పైగా) లాక్కెళ్లాడు. రాచకొండ పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆ దొంగను ఈ నెల 3న పట్టుకున్నారు.
  • ఈనెల 2న నేరెడ్‌మెట్‌ డిఫెన్స్‌కాలనీలో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న స్థానికురాలు రావిపాటి ఇందిర(52) మెడలోని గొలుసును తెంచుకొని పరారయ్యాడు. స్థానికుల సాయంతో రాచకొండ పోలీసులు అదే రోజు దొంగను అదుపులోకి తీసుకున్నారు.
  • కొన్ని రోజుల కిందట పుప్పాలగూడలో స్కూటీపై వెనుక కూర్చున్న మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన ముగ్గురు గొలుసు దొంగలను సైబరాబాద్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు.

అప్పట్లో అంతర్రాష్ట్ర ముఠాలు.. ఇప్పుడేమో..

గతంలో ఎక్కడో చోట వాహనాలను దొంగిలించి, దాని నంబరు ప్లేట్‌ను తొలగించి అరతర్రాష్ట్ర దొంగల ముఠాలు గొలుసు దొంగతనాలకు పాల్పడేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన నగర యువకులే గొలుసు దొంగలుగా మారుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఆ జాబితాలో విద్యార్థులు కూడా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క గొలుసును లాక్కెళితే చాలు.. దండిగా డబ్బులొస్తాయనే ఉద్దేశంతోనే అటువైపు అడుగులు వేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. తర్వాత అదే అలవాటుగా మారుతుందని వివరిస్తున్నారు. తాజాగా కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు కూడా గొలుసు దొంగలుగా మారుతున్నారు. ఇటీవల నేరెడ్‌మెట్‌, మల్కాజ్‌గిరి పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు ఆ కోవలోని వారే కావడం గమనార్హం.

చిక్కకుండా ఎత్తులకు పైఎత్తులు

రోడ్డుపై నడిచి వెళుతున్న మహిళలనే గతంలో గొలుసు దొంగలు లక్ష్యంగా చేసుకునేవారు. ఇప్పుడు మరింత తెగిస్తున్నారు. ఒంటరిగా కనిపిస్తే చాలూ గొలుసును తెంచుకెళుతున్నారు. ద్విచక్ర వాహనాలపై వెనుక కూర్చున్న వాళ్లనూ వదిలిపెట్టడం లేదు. పోలీసులకు చిక్కకుండా ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ముఖానికి మాస్కులు పెట్టుకుంటున్నారు. దృష్టి మరల్చేందుకు మార్గం మధ్యలోనే వేషం మార్చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోలీసులు వారి ఆట కట్టిస్తున్నారు. కొన్ని కేసులు మాత్రం ఇప్పటికీ తేలలేదు. సీసీకెమెరాలున్నాయి కదా అనే భరోసాతో క్షేత్రస్థాయిలో నిఘాను పోలీసులు గాలికొదిలేయడంతోనే వరుస గొలుసు దొంగతనాలు జరుగుతున్నాయని నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండిః పతంగి ఎగురవేస్తుండగా.. చిన్నారికి కరెంటు షాక్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.