హైదరాబాద్‌లోని పాతబస్తీ వంటి రద్దీ మార్కెట్లలో చరవాణులు దొంగిలిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 25 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు.
అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన ప్రశాంత్ ఆరుగురితో కలిసి ముఠాగా ఏర్పడి... దొంగతనాలకు పాల్పడేవాడని సీపీ వెల్లడించారు. పాతబస్తీలోని రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పలువురి జేబుల్లో నుంచి చరవాణులు చోరీ చేసేవారన్నారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నట్లు అంజనీకుమార్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అదృశ్యం కేసు: తొమ్మిది మంది కలిసి కొట్టి చంపేశారు!